శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 18, 2020 , 12:17:37

లీలావ‌తి అవార్డు -2020 ఆవిష్క‌రించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి

లీలావ‌తి అవార్డు -2020 ఆవిష్క‌రించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి

ఢిల్లీ :మ‌న దేశ బాలికలు స్వావ‌లంబ‌న సాధించ‌డానికి, ఆత్మ‌విశ్వాసం క‌లిగి ఉండ‌డానికి విజ‌యంసాధించ‌డానికి వారికి నాణ్య‌మైన విద్య‌ను అందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌ అన్నారు. లీలావ‌తి అవార్డు 2020ని వర్చువ‌ల్‌గా ఆవిష్క‌రించిన సందర్భంగా ఆయన  మాట్లాడారు. ఇది  మ‌హిళ‌ల‌కు సాధికార‌త క‌ల్పించేందుకు ఎఐసిటిఇ వారి వినూత్న విద్యా కార్య‌క్ర‌మం. మ‌హిళ‌ల సాధికార‌త  ఈ కార్య‌క్ర‌మం ముఖ్యాంశం అయినందున పారిశుధ్యం, ప‌రిశుభ్ర‌త‌, ఆరోగ్యం,పౌష్టికాహారం, అక్ష‌రాస్య‌త‌, ఉపాధి,సాంకేతిక ప‌రిజ్ఞానం, రుణ‌స‌దుపాయం, మార్కెటింగ్‌, వినూత్న ఆవివ‌ష్క‌ర‌ణ‌లు, నైపుణ్యాభివృద్ధి , స‌హ‌జ‌వ‌న‌రులు, మ‌హిళ‌ల హ‌క్కుల పై వారిలో చైత‌న్యం క‌లిగించ‌డం ఈ అవార్డు ల‌క్ష్యం. ప్రోఫెస‌ర్‌రాజీవ్‌కుమార్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ, ఎఐసిటిఇ, అలాగే ఎఐసిటిఇ ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ అనిల్ సహ‌స్ర‌బుధే, వైస్ ఛైర్మ‌న్ ఎఐసిటిఇ ప్రొఫెస‌ర్ ఎం.పి.పూనియా, ఎన్‌.ఇ.పి ముసాయిదా క‌మిటీ స‌భ్యురాలు వ‌సుధా కామ‌త్,మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇత‌ర సీనియర్ అధికార‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.