మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 16, 2020 , 22:02:59

కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శరీర ఉష్ణోగ్రత్తలో మార్పు రావడంతో కరోనా వైరస్ కోసం పరీక్ష జరుపగా పాజిటివ్ గా తేలిందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయనకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కనీసం ఏడుగురు కేంద్ర మంత్రులు, 20 మందికి పైగా మంది చట్టసభ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. బుధవారం నాడే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కూడా కొవిడ్-19 కు గురై దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు. 

"నిన్న నేను బలహీనంగా ఉన్నాను. దాంతో వైద్యుడిని సంప్రదించాను. నాకు కొవిడ్ 19 పాజిటివ్ పరీక్షించారు. ప్రస్తుతం నేను అందరి ఆశీర్వాదాలతో, శుభాకాంక్షలతో బాగా పని చేస్తున్నాను. నాకు నేనుగా సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకున్నాను" అని నితిన్ గడ్కరీ తన ట్వీట్ లో రాశారు. తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ భద్రతా ప్రోటోకాల్‌ను అనుసరించాలని గడ్కరీ మరో ట్వీట్ లో తన అభిమానులకు సూచించారు. "నాతో పరిచయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రోటోకాల్‌ను అనుసరించాలని అభ్యర్థిస్తున్నాను. సురక్షితంగా ఉండండి" అని ట్వీట్ చేశారు.