శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 20:59:35

అమెజాన్ ‘ఎక్స్‌పోర్ట్ డైజెస్ట్ 2020’ ని విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

అమెజాన్ ‘ఎక్స్‌పోర్ట్ డైజెస్ట్ 2020’ ని విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఢిల్లీ : ఎంఎస్‌ఎంఈ రంగం వేగంగా కోలుకునేందుకు ఎగుమతులకు ఊతమివ్వడం అత్యంత కీలకమని కేంద్రమంత్రి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆయన అమెజాన్ ‘ఎక్స్‌పోర్ట్ డైజెస్ట్ 2020’ను సోమవారం విడుదల చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద భారతీయ ఎమ్‌ఎస్‌ఎమ్ఈల ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు చేరవేయడానికి గతంలోనే అమెజాన్ అంగీకరించింది. ఈ క్రమంలో అమెజాన్ ద్వారా భారతీయ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు చేసిన ఎగుమతుల విలువ ఇప్పటికే  రెండు బిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముకలాంటివని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు.

దేశ జీడీపీలో 28శాతం ఈ పరిశ్రమల నుంచే వస్తున్నదని, అలాగే ఎగుమతుల్లో కూడా 48శాతం ఇవే చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. దేశ ఎగుమతుల్లో చిన్న,మధ్య తరహా పరిశ్రమల శాతాన్ని 60కు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మనదేశంలో స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులు అమెజాన్ వెబ్‌సైట్ల ద్వారా యూఎస్‌ఏ, యూకే, యూఏఈ, కెనడా, మెక్సికో, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, టర్కీ, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లో మార్కెట్ సంపాదించుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో ‘మేక్ ఇన్ ఇండియా’కు మద్దతిస్తామన్న అమెజాన్.. 2025నాటికి భారత్ నుంచి 10బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది.


logo