శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 20:57:53

‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ ఈ-బుక్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ ఈ-బుక్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

ఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి మూడేండ్ల పదవీ కాలం లో అనేక విశేషాలను‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ పేరుతో  పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు. ఈ-వెర్షన్ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం విడుదల చేశారు. ఈ పుస్తకం కాఫీ టేబుల్ వెర్షన్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం న్యూఢిల్లీ లోని ఉప-రాష్ట్రపతి నివాసంలో జరిగింది. 250 పేజీలతో ఈ పుస్తకాన్ని ప్రచురణల విభాగం రూపొందించింది. భారతదేశంలోనూ, విదేశాలలోనూ, ఉపరాష్ట్రపతి చేసిన ప్రయాణాలతో సహా వివిధ రకాలైన కార్యకలాపాలను కథనాలు చిత్రాల ద్వారా ఈ పుస్తకంలో పొందుపరిచారు. 

రైతులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, యువత, నిర్వాహకులు, పరిశ్రమ నాయకులు మరియు కళాకారులతో, ఇతరులతో పరస్పర చర్చల సంగ్రహ స్వరూపాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఉపరాష్ట్రపతి విదేశీ సందర్శనలకు సంబంధించిన సంఘటనలు, ప్రపంచ నాయకులతో ఆయన జరిపిన సంభాషణలు మరియు వివిధ దేశాల్లోని భారతీయ ప్రవాసులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. 

ఈ-పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం జవదేకర్ మాట్లాడుతూ, కమ్యూనికేషన్ ద్వారా ప్రజలతో అనుసంధానం అవ్వడం గురించీ, భారతదేశాన్ని మార్చడం గురించీ, ఈ పుస్తకం తెలియజేస్తుందని" పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ప్రసంగాలను అనుసరించాలనుకునే విద్యార్థులకు ఈ పుస్తకం 3వ ఎడిషన్ ఒక నిధి లాంటిదని ఆయన అభివర్ణించారు.  ఉపరాష్ట్రపతి ప్రసంగాలు ఆలోచనలు ,భావోద్వేగాలతో నిండి ఉన్నాయని, భాషలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని ఆయన అన్నారు.  కాఫీ టేబుల్ బుక్ , దాని ఈ-వెర్షన్ ను రూపొందించి, విడుదల చేసినందుకు, ప్రచురణల విభాగాన్ని మంత్రి అభినందించారు.logo