ఆదివారం 29 మార్చి 2020
National - Mar 18, 2020 , 02:41:14

స్వీయనిర్బంధంలో కేంద్ర మంత్రి

స్వీయనిర్బంధంలో కేంద్ర మంత్రి

తిరువనంతపురం: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఒకరు స్వీయనిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. కరోనా నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించేందుకు మూడ్రోజుల క్రితం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీచిత్ర తిరునాళ్‌ వైద్యకళాశాలను కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్‌ సందర్శించారు. అక్కడ పలువురు వైద్యులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో పాల్గొన్న ఒక డాక్టర్‌ మార్చి ఒకటో తేదీన స్పెయిన్‌ నుంచి వచ్చారని, ఆయనకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా ఉన్నట్టు మరుసటిరోజు తేలింది. దాంతో విషయాన్ని శ్రీచిత్ర తిరునాళ్‌ వైద్యకళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఆశా కిశోర్‌ కేంద్ర మంత్రికి తెలిపారు. ఢిల్లీలో ఆయన కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. వైద్యనివేదిక నెగెటివ్‌గా వచ్చింది. అయిప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా స్వీయనిర్బంధంలో ఉండాలని కేంద్రమంత్రి నిర్ణయించారు. 


logo