సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 15:14:07

కరోనా వైరస్‌పై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సమీక్ష

కరోనా వైరస్‌పై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సమీక్ష

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆయా రాష్ర్టాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రం తరపున వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, యోగితా రాణా పాల్గొన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణపై కేంద్ర మంత్రి పలు సూచనలు చేశారు. కరోనాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలను హర్షవర్ధన్‌ అభినందించారు. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని కేంద్ర మంత్రి కొనియాడారు. మిగతా రాష్ర్టాలు కూడా తెలంగాణను అనుసరించాలని కేంద్ర మంత్రి సూచించారు. ఎన్‌-95 మాస్క్‌లను అందించాలని హర్షవర్ధన్‌ను ఈటల కోరారు. మరో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రాన్ని కోరారు.


logo