బుధవారం 08 జూలై 2020
National - Jun 29, 2020 , 21:48:03

గాయాలైన వ్య‌క్తుల‌ను ఆస్ప‌త్రికి పంపించిన కేంద్ర‌మంత్రి

గాయాలైన వ్య‌క్తుల‌ను ఆస్ప‌త్రికి పంపించిన కేంద్ర‌మంత్రి

రాజ‌స్థాన్: షేర్ గ‌ఢ్ ప్రాంతంలో బైకు అదుపుతప్పి ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. రెండు బైకులు, ఇద్ద‌రు వ్య‌క్తులు చెల్లాచెదురుగా పడిఉన్నారు. అదే స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి, బీజేపీ ఎంపీ  గ‌జేంద్ర‌సింగ్ షెఖావ‌త్ జోధ్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌కు కాన్వాయ్ లో వెళ్తున్నారు. రోడ్డు ప‌క్క‌నే గాయాల‌తో ప‌డిఉన్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను దగ్గ‌రుండి త‌న వాహ‌నంలో ఆస్ప‌త్రికి త‌ర‌లించి..ప్రాణాలు కాపాడారు.

ఆస్ప‌‌త్రికి ఫోన్ చేసి గాయాలైన వ్య‌క్తుల‌కు మెరుగైన‌ వైద్యం అందించాల‌ని వైద్యుల‌కు సూచించారు.  ప్ర‌మాదంలో ఉన్న వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి ప్రాణాలు కాపాడిన  ‌మంత్రి గ‌జేంద్ర‌సింగ్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. 
logo