గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 22:26:11

మ‌నోద‌ర్ప‌ణ్ ప్ర‌త్యేక వెబ్ పేజీని ప్రారంభించిన కేంద్ర హెచ్‌.ఆర్‌.డి మంత్రి

 మ‌నోద‌ర్ప‌ణ్ ప్ర‌త్యేక వెబ్ పేజీని ప్రారంభించిన కేంద్ర హెచ్‌.ఆర్‌.డి మంత్రి

ఢిల్లీ: విద్యార్థుల మాన‌సిక ఆరోగ్యం తోపాటు వారి శ్రేయ‌స్సుకోసం వారికి మ‌ద్ద‌తు నిచ్చేందుకు హెచ్‌.ఆర్‌.డి  మంత్రిత్వ‌శాఖ  చేప‌ట్టిన మ‌నోద‌ర్ప‌ణ్ కార్య‌క్ర‌మాన్నికేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో హెచ్‌.ఆర్‌.డి శాఖ స‌హాయ‌మంత్రి సంజ‌య్ ధోత్రే కూడా ఈ పాల్గొన్నారు. మ‌నోద‌ర్ప‌ణ్ చొర‌వ‌లో భాగంగా ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, నేష‌న‌ల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్(8448440632)ను, హెచ్‌.ఆర్‌.డి మంత్రిత్వ‌శాకఖ పోర్ట‌ల్‌లో ఒక ప్ర‌త్యేక వెబ్ పేజీ  మ‌నోద‌ర్ఫ‌ణ్‌ను, మ‌నోద‌ర్ప‌ణ్ హ్యాండ్ బుక్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ, "కోవిడ్ -19 ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రికీ ఒక స‌వాలు "అని అన్నారు. ఈ అంతర్జాతీయ మ‌హమ్మారి వైద్య‌ప‌రంగా తీవ్ర ఆందోళ‌న క‌లిగించేదే కాక‌, అంద‌రికీ ఒక‌ర‌క‌మైన మిశ్ర‌మ భావోద్వేగాలను, మాన‌సిక‌-సామాజిక ఒత్తిడినీ తీసుకువ‌స్తున్న‌ద‌ని "ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేకించి  కౌమార ద‌శ‌లోఉన్న‌ పిల్ల‌లకు ఇలాంటి పరిస్థితుల‌లో , మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉందని" అన్నారు. పిల్ల‌లు కౌమార‌ద‌శ‌లోని వారు దీని బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ అని,  వీరు ఇత‌ర మాన‌సిక ప్ర‌వ‌ర్త‌నా స‌మ‌స్య‌ల‌తో పాటు, విప‌రీత‌మైన ఒత్తిడి ,ఆందోళ‌న‌, భ‌యాన్నిఅనుభ‌వించే అవ‌కాశం ఉందని "ఆయన చెప్పారు.


logo