బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 10:53:52

విశాఖ ఘటన కలిచి వేసింది : అమిత్‌ షా

విశాఖ ఘటన కలిచి వేసింది : అమిత్‌ షా

న్యూఢిల్లీ : విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటన తన మనసును కలిచి వేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ ఘటనపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నానని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.


logo