సోమవారం 06 జూలై 2020
National - Jun 18, 2020 , 15:03:04

మొబైల్‌ లాబోరేటరీని ప్రారంభించిన కేంద్ర మంత్రి

మొబైల్‌ లాబోరేటరీని ప్రారంభించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : దేశంలోనే మొదటి కొవిడ్‌-19 మొబైల్‌ టెస్ట్‌ లాబోరేటరీని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఢిల్లీలో ప్రారంభించారు. కరోనా టెస్టులు చేసేందుకు, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ మొబైల్‌ లాబోరేటరీని రూపొందించారు. దీన్ని మారుమాల ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఇందులో రోజుకు 25ఆర్‌టీపీసీఆర్‌, ౩౦౦ ఎలీసా, టీబీ, హెచ్‌ఐవీ పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్‌-19పై పోరాడేందుకు ఫిబ్రవరిలో మొదటి ప్రయోగశాల ప్రారంభిస్తే, ఇప్పటికే దేశవ్యాప్తంగా 953కు చేరాయని, ఇందులో 699 ప్రభుత్వ ప్రయోగశాలలు ఉన్నట్లు తెలిపారు.


logo