శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 13:24:56

కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు : కేంద్ర మంత్రి

కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు చేపట్టామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిపై లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి నిరోధంపై రోజువారీ సమీక్షలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇరాన్‌, ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. నెగిటివ్‌ వచ్చిన ప్రయాణికులను మాత్రమే బయటికి పంపిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికీ మన దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు అనుమానిత వ్యక్తుల నమూనాలను పంపించి ఫలితాలు తెలుసుకుంటున్నాం. దీనితో పాటు మరో 15 ల్యాబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అయితే ఈ వైరస్‌ను అన్ని ల్యాబ్‌ల్లో నిర్ధారించలేము అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 


logo