శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 19, 2020 , 17:21:35

నెలలో ఎన్నిసార్లు ప్లాస్మా దానం చేయొచ్చు?

నెలలో ఎన్నిసార్లు ప్లాస్మా దానం చేయొచ్చు?

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నెలలో రెండుసార్లు ప్లాస్మా దానం చేయవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు. ప్లాస్మా దానంపై ఢిల్లీ పోలీసులు ఎయిమ్స్ దవాఖానలో ఆదివారం చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న పోలీసులు ప్లాస్మా దానం చేశారు. మంత్రి హర్ష వర్ధన్ వారిని అభినందించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 2,532 మంది ఢిల్లీ పోలీసులు కరోనా బారిన పడ్డారని, వారిలో కొందరు కోలుకుని ప్లాస్మా దానానికి ముందుకు వచ్చారని తెలిపారు. కరోనాపై గెలిచిన పోలీసు వారియర్లు ప్రస్తుతం ప్లాస్మా వారియర్లుగా మారారని ఆయన కొనియాడారు.

మరోవైపు కరోనా సోకిన పోలీసుల్లో 84 శాతం మంది కోలుకున్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్మాను దానం చేసేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల అవసరమైన కరోనా రోగులకు తమ పోలీసులు ప్లాస్మా దానం చేస్తారని ఆయన చెప్పారు. పోలీసుల ప్లాస్మా దానం, దీనిపై తమ ప్రచారం వల్ల ఇతరులు కూడా ముందుకు వచ్చేందుకు దోహదపడుతుందని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.
logo