మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 12:06:11

రూ. లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రారంభం

రూ. లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రారంభం

న్యూఢిల్లీ : దేశంలోని రైతులను దృష్టిలో ఉంచుకుని రూ. లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థికసాయం అందించనుంది కేంద్రం. సదుపాయాల కల్పనకు రూ. లక్ష కోట్లు మంజూరు చేయనుంది. ఇందుకోసం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్ర వ్యవసాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. పీఎం కిసాన్‌ పథకం కింద ఆరో విడుత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున జమ చేసేలా రూ. 17 వేల కోట్ల రుణాలు విడుదల చేశారు. 

తాజావార్తలు


logo