ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 00:11:22

ఎఐఐబి బోర్డు గ‌వ‌ర్న‌ర్ల వార్షిక స‌మావేశంలో పాల్గొన్నకేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి

ఎఐఐబి బోర్డు గ‌వ‌ర్న‌ర్ల వార్షిక స‌మావేశంలో పాల్గొన్నకేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మంగళ వారం న్యూఢిల్లీలో జ‌రిగిన‌  ఏసియ‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) బోర్డు గ‌వ‌ర్న‌ర్ల 5 వ వార్షిక స‌మావేశానికి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా హాజ‌ర‌య్యారు.‌ బ్యాంకు భ‌విష్య‌త్‌పై ప్ర‌భావం చూపే కీల‌క నిర్ణ‌యాలను బ్యాంకు వార్షిక స‌మావేశంలో జ‌రిగే బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశంలో తీసుకుంటూ ఉంటారు. ఈ సమావేశంలో ఎఐఐబి అధ్య‌క్షుడి ఎన్నిక, ఎఐఐబి-2030- వచ్చే ద‌శాబ్దంలో ఆసియా అభివృద్ధికి మ‌ద్ద‌తు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ చ‌ర్చ జరిగింది.  logo