సోమవారం 06 జూలై 2020
National - Jun 24, 2020 , 13:41:45

ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమై కొనసాగుతుంది. 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో మంత్రివర్గం సమావేశమైంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, రవిశంకర్‌ప్రసాద్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 1న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం నిమిత్తం రూ. 50 వేల కోట్ల ఈక్విటీ విధివిధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కోవిడ్‌-19 వల్ల తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా కేంద్రం పలు రంగాలకు సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.logo