శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 14:16:14

కేంద్ర మంత్రివ‌ర్గ త‌దుప‌రి భేటీలో మ‌రో ఆరు విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌

కేంద్ర మంత్రివ‌ర్గ త‌దుప‌రి భేటీలో మ‌రో ఆరు విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌

ఢిల్లీ : దేశంలోని ఆరు విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్ర మంత్రివ‌ర్గం త‌న త‌దుప‌రి స‌మావేశంలో ప‌చ్చ‌జెండా ఊప‌నుంది. అమృత్‌స‌ర్‌, ఇండోర్, రాంచీ, త్రిచి, భువనేశ్వర్, రాయ్‌ఫూర్ విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. వార‌ణాసి, అమృత్‌స‌ర్‌, ఇండోర్‌, భువ‌నేశ్వ‌ర్‌, త్రిచి విమానాశ్ర‌యాలు అంత‌ర్జాతీయ విమాన‌యాన సేవ‌ల‌ను అందిస్తుండ‌గా రాయ్‌పూర్ దేశీయ విమాన సేవ‌ల కార్య‌క‌లాపాల‌ను అందిస్తుంది. ఆరు విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించి ఆగ‌స్టు 15వ తేదీలోగా ప్ర‌భుత్వం తెల‌ప‌నుంది. మంత్రివ‌ర్గ ఆమోదం అనంత‌రం బిడ్డింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మౌతుంది. 

ప్రభుత్వం 2018 నవంబర్‌లో 12 ప్రభుత్వ విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మొదటి దశలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, గౌహతి, తిరువనంతపురం, జైపూర్ ఈ ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. మొద‌టి ద‌శ‌లో అదానీ గ్రూప్ మొత్తం ఆరు విమానాశ్రయాలకు అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌పై మే 2020 లో ప్రధానమంత్రి కార్యాలయం సమీక్ష సమావేశాన్నినిర్వహించింది. మూడు నెలల్లో మిగిలిన ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.


logo