సోమవారం 25 జనవరి 2021
National - Dec 23, 2020 , 18:02:42

ఐదు ఫిల్మ్‌ యూనిట్ల విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఐదు ఫిల్మ్‌ యూనిట్ల విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్స్‌ ప్రొడ్యూస్‌లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రతీ ఏటా 3 వేలకు పైగా సినిమాలు విడుదల అవుతుంటాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సినిమా రంగానికి మద్దతుగా ఓ నిర్ణయం ప్రకటించింది. నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో దాని అనుబంధ నాలుగు విభాగాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఎఫ్‌డీసీలో ఫిల్మ్‌ డివిజన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా, చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఫిల్మ్స్ డివిజన్ : 

స‌మాచార‌, ప్ర‌సారశాఖ‌ సబార్డినేట్ కార్యాలయం. 1948 లో స్థాపించబడింది. ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం నిమిత్తం న్యూస్ మ్యాగ్జిన్స్ రూప‌కల్ప‌న‌‌, భారతీయ సినిమా చరిత్ర డాక్యుమెంటరీల‌ రికార్డు. 

చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ :

ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. 1955 లో సొసైటీస్ యాక్ట్ క్రింద స్థాపించ‌బ‌డింది. పిల్లలు మరియు యువకులకు చిత్రాల మాధ్యమం ద్వారా విలువ ఆధారిత వినోదాన్ని అందించాలనే నిర్దిష్ట లక్ష్యంతో స్థాపించబడింది.

నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా :

స‌మాచార‌, ప్ర‌సారశాఖ‌ సబార్డినేట్ కార్యాలయం. 1964 లో భారతీయ సినిమా వారసత్వాన్ని సంపాదించి, పరిరక్షించాలనే ప్రాధమిక లక్ష్యంతో మీడియా యూనిట్‌గా స్థాపించబడింది.

డైర‌క్ట‌రేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ :

స‌మాచార‌, ప్ర‌సారశాఖ‌ సబార్డినేట్ కార్యాలయం. 1973లో స్థాపించ‌బ‌డింది. భార‌తీయ సినిమాల‌ను, సంస్కృతిని ప్ర‌మోట్ చేసే నిమిత్తం ఏర్పాటు చేయ‌బ‌డింది. 


logo