మంగళవారం 19 జనవరి 2021
National - Dec 30, 2020 , 14:41:43

ఆకాశ్ క్షిప‌ణుల ఎగుమ‌తికి కేంద్ర కేబినెట్ ఆమోదం

ఆకాశ్ క్షిప‌ణుల ఎగుమ‌తికి కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన ఆకాశ్ క్షిప‌ణుల‌ ఎగుమ‌తికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో ఈ ఉద‌యం స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండ‌లి ఆకాశ్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ ఎగుమ‌తికి అనుమ‌తించింద‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అదేవిధంగా ఈ ఎగుమ‌తుల‌కు త‌క్ష‌ణ అనుమ‌తులు మంజూరు చేయ‌డం కోసం ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. అయితే భార‌త బ‌ల‌గాలు వినియోగిస్తున్న ఆకాశ్ మిసైట్ సిస్ట‌మ్, తాజాగా ఎగుమ‌తుల‌కు అనుమంతించిన అకాశ్ మిసైల్ సిస్ట‌మ్ వేర్వేరు అని రాజ్‌నాథ్‌సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.