మంగళవారం 19 జనవరి 2021
National - Jan 05, 2021 , 16:47:41

ఫిబ్ర‌వ‌రి ఒకటో తేదీన కేంద్ర బ‌డ్జెట్

ఫిబ్ర‌వ‌రి ఒకటో తేదీన కేంద్ర బ‌డ్జెట్

న్యూఢిల్లీ‌:  కేంద్ర బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.  ఈనెల 29వ తేదీ నుంచి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభంకానున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  వాస్త‌వానికి గ‌త ఏడాది క‌రోనా వైర‌స్ వ‌ల్ల శీతాకాల స‌మావేశాలను ర‌ద్దు చేశారు. అంతే కాదు, గ‌త ఏడాది వ‌ర్షాకాల స‌మావేశాల‌ను అర్ధాంత‌రంగా ముగించారు. జ‌న‌వ‌రి 29వ తేదీన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం చేయ‌నున్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.  ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కుతొలి ద‌ఫా స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు రెండవ ద‌ఫా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.