సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 01:01:15

ఏ వయస్సులో తల్లి కావచ్చు?

ఏ వయస్సులో తల్లి కావచ్చు?
  • అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్‌: కేంద్రం

న్యూఢిల్లీ: ఒక యువతి ఏ వయస్సులో మాతృత్వ దశలోకి ప్రవేశించాలో అధ్యయనం చేయడానికి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. పెండ్లి చేసుకునేందుకు స్త్రీ, పురుషులకు సమానంగా ఒకే వయోపరిమితిని విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫు న్యాయవాది ఇటీవల పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పా టు చేస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. టాస్క్‌ఫోర్స్‌కు ఆరునెలల సమయం ఇచ్చారని చెప్పారు. దీంతో కేంద్రానికి మరింత గడువునిస్తున్నామని పేర్కొంటూ కేసు విచారణను హైకోర్టు మే 28కి వాయిదా వేసింది. పెండ్లి వయసు పురుషులకు 21గా, మహిళలకు 18గా నిర్దేశించడం వివక్ష అని పిటిషనర్‌ చెప్పారు.


logo