ఆదివారం 29 మార్చి 2020
National - Mar 18, 2020 , 14:54:06

చనిపోయింది హిందువు..కానీ ఇస్లాం పద్దతిలో ఖననం

చనిపోయింది హిందువు..కానీ ఇస్లాం పద్దతిలో ఖననం

జైపూర్‌: రాజస్థాన్‌లోని టోంక్‌ జిల్లాలో ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు అతన్ని గుర్తించి దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స కొనసాగుతుండగానే అతడు ప్రాణాలు విడిచాడు. డాక్టర్లు చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తించడానికి..అతని డెడ్‌బాడీని ఆస్పత్రిలోనే ఉంచారు. స్థానికంగా ఉన్న ముస్లిం, హిందూ కమ్యూనిటీకి చెందిన పెద్దలకు సమాచారమందించారు. చనిపోయిన వ్యక్తి శరీరంపై ఉన్న కొన్ని గుర్తుల ఆధారంగా అతడు ముస్లిం వ్యక్తి అని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

ఇరు మతాల పెద్దల నిర్ణయంతో సదరు వ్యక్తికి ఇస్లాం సంప్రదాయ పద్దతిలో ఖననం (అంత్యక్రియలు)చేశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం విడుదల చేసిన ఫొటోలు వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ కావడంతో..ఆ ఫొటోలను అతని కుటుంబసభ్యులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి మహవీర్‌ సాహు అని..అతని డెడ్‌బాడీని తమకు అప్పగించాలని కుటుంబసభ్యులు అధికారులు, డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతితో మహవీర్‌ సాహు బాడీని బయటకు తీసి..అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత మహవీర్‌ సాహు అంత్యక్రియలను హిందూ సంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. 


logo