శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 11:56:20

జీవితం మీద విర‌క్తితో ఆత్మ‌హ‌త్య చేసుకున్న మేక‌.. స్పాట్ డెడ్‌!

జీవితం మీద విర‌క్తితో ఆత్మ‌హ‌త్య చేసుకున్న మేక‌.. స్పాట్ డెడ్‌!

చిన్న స‌మ‌స్య వ‌స్తే చాలు సూసైడ్ చేసుకోవ‌డం ఇప్పుడు ఫ్యాష‌న్‌గా మారింది. ఈ త‌రహాలోకి ఇప్పుడు జంతువులు కూడా వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఒక మేక మేడ మీద నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. ఈ సంఘ‌ట‌న కాస్త సీసీకెమెరాలో రికార్డు అయింది. ఇది ఆత్మ‌హ‌త్యా లేదంటే యాక్సిడెంట్‌గా జ‌రిగిందా అని వీడియో చూస్తే గాని అర్థం కాదు.

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఓ వ్య‌క్తి మేకల్ని మేపేందుకు ప్ర‌దేశం లేక‌పోవ‌డంతో ఇంటి టెర్రస్‌ మీద మేపుతున్నాడు. అక్క‌డ మూడు మేక‌లు ఉన్నాయి. ఆహారం పంచుకునేట‌ప్పుడు గొడ‌వైందో ఏమో మూడు మేక‌లు పోట్లాడుకున్నాయి. రెండు మేక‌ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి మూడో మేక పిట్ట‌గోడ‌ దూకి పారిపోదాం అనుకున్న‌ది. అలానే చేసింది. కాక‌పోతే ప‌క్క‌న మ‌రొక గోడ లేక‌పోవ‌డంతో కింద‌ప‌డి మ‌ర‌ణించింది. అస‌లు విష‌యం ఇదైతే.. అక్క‌డ ప్ర‌జ‌లు మాత్రం మేక ఆత్మ‌హ‌త్య చేసుకుం‌ద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. మ‌నుషుల విష‌యం తెలిసిందే క‌దా..! ఈ సంఘ‌ట‌న సీసీకెమెరాలో రికార్డు కావ‌డంతో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది వైర‌ల్‌గా మారింది. logo