బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 13:49:52

డిసెంబ‌ర్ 1 నుంచి డిగ్రీ, పీజీ త‌ర‌గ‌తులు

డిసెంబ‌ర్ 1 నుంచి డిగ్రీ, పీజీ త‌ర‌గ‌తులు

కోల్‌క‌తా: క‌రోనా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌భుత్వాలు ఒక్కొక్క‌టిగా స‌డ‌లిస్తున్నాయి. ఇప్ప‌టికే ఒక్కో ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను నిర్వహిస్తూ పోతున్న ప్ర‌భుత్వాలు విద్యాసంవ‌త్సరం ప్రారంభంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా డిసెంబ‌ర్ 1న డిగ్రీ, పీజీ కాలేజీలు ప్రారంభించాల‌ని ప‌శ్చిమబెంగాల్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రంలో ముఖ్య‌మైన పండుగుల‌న్నీ న‌వంబ‌ర్ నెల‌లో ముగుస్తుండ‌టంతో అక‌డ‌మిక్ ఇయ‌ర్‌ను డిసెంబ‌ర్‌లో ప్రారంభించాల‌ని నిర్ణ‌యించామ‌ని రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ మంత్రి పార్థ చ‌ట‌ర్జీ ప్ర‌క‌టించారు. ఆ అంశంపై ఆయ‌న యూనివ‌ర్సిటీల వైస్‌చాన్స‌ర్ల‌తో చ‌ర్చించారు.  

న‌వంబ‌ర్ నెల‌లో వ‌రుస‌గా లక్ష్మీ పూజ‌, కాళీ పూజ లేదా దీపావ‌ళి, ఛాట్ పూజ‌, జ‌గ‌ద్ధాత్రి పూజ వంటి పండుగ‌లు ఉన్నాయి. అందువ‌ల్ల 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి కాలేజీల‌ను పీజీ, యూజీ కాలేజీల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే చాలా విశ్వ‌విద్యాల‌యాలు ఆన్‌లైన్ క్లాసుల‌ను ప్రారంభించాయ‌ని చెప్పారు. విద్యార్థుల‌కు కోర్సు మెటీరియ‌ల్‌ను కూడా అందిస్తున్నాయ‌న్నారు. అయితే ఆన్‌లైన్ సౌక‌ర్యం లేనివారు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు.  


logo