సోమవారం 18 జనవరి 2021
National - Dec 04, 2020 , 21:28:30

రుణం చెల్లించ‌లేక యూపీలో రైతు ఆత్మ‌హ‌త్య‌

రుణం చెల్లించ‌లేక యూపీలో రైతు ఆత్మ‌హ‌త్య‌

ఎటా: బ‌్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించ‌లేక ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నిధౌలి క‌లాన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ధుల్లా గ్రామంలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ధుల్లా గ్రామానికి చెందిన సురేష్ అనే రైతు గత మూడు రోజులుగా క‌నిపించ‌కుండా పోయాడు. కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న కోసం ప‌రిస‌ర గ్రామాల్లో వెతికినా ప్ర‌యోజ‌న లేక‌పోయింది. చివ‌ర‌కు అతడి మృతదేహం శుక్రవారం గ్రామం స‌మీపంలోని కాలువలో తేలుతూ కనిపించింది. కొన్నేండ్ల‌ క్రితం బ్యాంకు నుంచి రూ.4 లక్షల రుణం తీసుకున్న సురేష్‌..  పంట స‌రిగా రాక‌పోవ‌డంతో తిరిగి చెల్లించలేకపోయాడు. కొన్ని రోజుల క్రితం బ్యాంకు సిబ్బంది సురేష్ ఇంటికి వ‌చ్చి రుణం తిరిగి చెల్లించకపోతే ఆయ‌న ఇంటిని అటాచ్ చేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి సురేష్ తీవ్ర‌ ఒత్తిడికి గురయ్యాడు. గురువారం ఉద‌యం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన సురేష్ గ్రామం సమీపంలో ఉన్న కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అథారా గ్రామ సమీపంలో మృతదేహం లభ్యమైందని అతని సోదరుడు జగదీష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న‌ట్లు నిధౌలీ పోలీసులు తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.