బుధవారం 27 జనవరి 2021
National - Dec 17, 2020 , 09:52:28

మూడంతస్థుల పైనుంచి పాదచారిపై కూలిన పిల్లర్‌... వీడియో

మూడంతస్థుల పైనుంచి పాదచారిపై కూలిన పిల్లర్‌... వీడియో

జైపూర్‌: ఇద్దరు యువకులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా వారిపై ఓ పిల్లర్‌ కూలిపడింది. దీంతో ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భరత్‌పూర్‌లోని మార్కెట్‌ ప్రాంతంలో ఓ దుకాణంపై నిర్మాణం జరుగుతున్నది. నిన్న ఇద్దరు యువకులు దుకాణం ముందునుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిపై షాప్‌ మూడో అంతస్థు నుంచి ఓ పిల్లర్‌ పడిపోయింది. దీంతో ఓ యువకుడు క్షేమంగా బయటపడగా, మరో యువకుడు కుప్పకూలిపోయాడు. పిల్లర్‌ అతనిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కిందపడిపోయిన అతడిని స్థానికులు దవాఖానకు తరలించారు. 

కాగా, నిర్మాణంలో ఉన్న పిల్లర్‌ అకస్మాత్తుగా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. యువకుని తలకు తీవ్రంగా గాయాలయ్యాయని, ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. ఈ ఘటనపై తాము షాపు యజమానితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.


logo