శనివారం 29 ఫిబ్రవరి 2020
పుల్వామా అమ‌ర జ‌వాన్ల ఇంటి నుంచి మట్టిని సేక‌రించి..

పుల్వామా అమ‌ర జ‌వాన్ల ఇంటి నుంచి మట్టిని సేక‌రించి..

Feb 14, 2020 , 15:09:12
PRINT
పుల్వామా అమ‌ర జ‌వాన్ల ఇంటి నుంచి మట్టిని సేక‌రించి..

హైద‌రాబాద్‌:  ఈయ‌న పేరు ఉమేశ్ గోపినాథ్ జాద‌వ్‌.  బెంగుళూరుకు చెందిన సింగ‌ర్ ఈయ‌న‌. గ‌త ఏడాది పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌వాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే.  ఆ సైనికుల‌కు నివాళి అర్పించేందుకు ఉమేశ్ గోపినాథ్‌.. 61 వేల కిలోమీట‌ర్లు తిరిగాడు.  పుల్వామాలో చ‌నివాయిన ప్ర‌తి సైనికుడి ఇంటికి వెళ్లాడు.  ఆ సైనికుల కుటుంబ‌స‌భ్యుల‌ను క‌లిసి మాట్లాడాడు. వారి ఇంటి ముందున్న మ‌ట్టిని,  ఆ సైనికుల‌ను ద‌హ‌నం చేసిన‌ ప్రాంతం నుంచి మ‌ట్టిని ఓ క‌ల‌శంలో పెట్టుకుని దేశ‌మంతా తిరిగాడు.  ఇవాళ పుల్వామా దాడికి ఏడాది ముగిసింది. ఈ నేప‌థ్యంలో క‌శ్మీర్‌లోని లెత్‌పోరా క్యాంపు వ‌ద్ద భారీ స్థూపాన్ని ఆవిష్క‌రించారు.  ఆ స్థూపం వ‌ద్ద  సైనికుల ఇంటి నుంచి ఉమేశ్ గోపినాథ్ తెచ్చిన మ‌ట్టి క‌ల‌శాన్ని పెట్టారు.  అమ‌ర సైనికుల‌కు తాను ఇచ్చే ఘ‌న‌మైన నివాళి ఇదే అని ఉమేశ్ ఈ సంద‌ర్భంగా తెలిపాడు.  


logo