బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 12, 2020 , 11:32:09

ఉల్ఫా డిప్యూటీ క‌మాండర్ రాజ్‌ఖోవా లొంగుబాటు

ఉల్ఫా డిప్యూటీ క‌మాండర్ రాజ్‌ఖోవా లొంగుబాటు

న్యూఢిల్లీ: నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అసోం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) కీల‌క నేత‌, డిప్యూటీ కమాండర్ రాజ్‌ఖోవా పోలీసులకు లోంగిపోయారు. మేఘాలయలోని ద‌క్షిణ గారో హిల్స్ జిల్లాలో బుధవారం సాయంత్రం లొంగిపోయిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాజ్‌ఖోవా అలియాస్ మ‌నోజ్ ర‌భా లొంగిపోయాడని ఓ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు. కాగా, రాజ్‌ఖోవాను సైనిక అధికారులు త‌మ‌ ఆధీనంలోకి తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అందుకు మేఘాల‌య‌ పోలీసులు నిరాక‌రించార‌ని, అసోం పోలీసుల‌కు అప్పగించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ని స‌మాచారం. 

  

సౌత్ గారో హిల్స్ జిల్లాలో నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ తర్వాత రాజ్‌ఖోవా త‌న న‌లుగురు అంగ‌ర‌క్ష‌కుల‌తోస‌హా లొంగిపోయాడ‌ని విశ్వ‌సనీయ స‌మాచారం. అత‌ని నుంచి ఒక ఏకే-81 రైఫిల్‌, 90 రౌండ్ల తూటాలు క‌లిగిన రెండు మ్యాగ‌జైన్లు,  రెండు పిస్టళ్లు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ‌త నెల‌ 20న మేఘాల‌య‌లోని బోల్చోక్ గ్రే గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్‌ నుంచి రాజ్‌ఖోవా తృటిలో తప్పించుకున్నాడు. 2011, న‌వంబ‌ర్‌లో ఉల్ఫా డిప్యూటీ క‌మాండ్‌గా బాధ్య‌తలు చేప‌ట్టాడు.