సోమవారం 25 జనవరి 2021
National - Dec 24, 2020 , 12:22:18

బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన‌ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్‌

బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన‌ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్‌

భువ‌నేశ్వ‌ర్‌: బ‌్రిట‌న్‌లో విస్త‌రిస్తున్న‌స‌రికొత్త వైర‌స్ క‌రోనా స్ట్రెయిన్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న‌ది. కొత్త వైర‌స్ నేప‌థ్యంలో బ్రిట‌న్‌‌కు ఇప్ప‌టికే చాలా దేశాలు విమానాల‌ను ర‌ద్దుచేశాయి. ఆ దేశం నుంచి వ‌చ్చిన వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌కు 34 ఏండ్ల‌ ఓ వ్య‌క్తి లండ‌న్ నుంచి ఈ నెల 18న వ‌చ్చాడు. దీంతో అత‌నికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం అత‌డు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నాడు. కేంద్ర‌ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం అత‌నికి క‌రోనా స్ట్రెయిన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, భువ‌నేశ్వ‌ర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్‌కు అత‌ని న‌మూనాలు పంపించామ‌ని అధికారులు తెలిపారు. 

యూకే నుంచి వ‌చ్చిన వ్య‌క్తితోపాటు, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, వారిని ఐసోలేష‌న్‌లో ఉంచామ‌ని భువ‌నేశ్వ‌ర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ క‌మిష‌న‌ర్ ప్రేమ్ చంద్ర చౌద‌రి వెల్ల‌డించారు. 

కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రిలో కూడా క‌రోనా స్ట్రెయిన్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. బ్రిట‌న్ నుంచి రాజ‌మండ్రికి వ‌చ్చిన ఓ మ‌హిళ‌ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆమెను రాజ‌మండ్రి రైల్వే స్టేష‌న్ నుంచి నేరుగా కరోనా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఆమె ఈ నెల 21న బ్రిట‌న్ నుంచి ఢిల్లీకి వ‌చ్చింది. అటునుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో త‌న కొడుకుతో క‌లిసి రైలులో రాజ‌మండ్రికి చేరుకున్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి..

బ్రిట‌న్ ప్ర‌యాణికుల్లో 22 మందికి క‌రోనా పాజిటివ్

రాజస్థాన్‌లో న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్‌

కొత్త‌గా 24,712 క‌రోనా పాజిటివ్ కేసులు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్   డౌన్లోడ్ చేసుకోండి.
logo