శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Dec 14, 2020 , 14:21:47

నేటి నుంచి భారత్‌లో యూకే విదేశాంగ కార్యదర్శి పర్యటన

నేటి నుంచి భారత్‌లో యూకే విదేశాంగ కార్యదర్శి పర్యటన

న్యూఢిల్లీ : యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్‌ రాబ్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం భారత్‌కు రానున్నారు.  మంగళవారం ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ధైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర సహకారంపై చర్చించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.  కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌తోనూ ఆయన సమావేశం కానున్నట్లు పేర్కొంది.

ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, వాతావరణ మార్పులు, విద్యా, ఆరోగ్యరంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడేందుకు రాబ్‌ పర్యటన ఎంతగానో దోహదం చేస్తుందని విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది.  చివరిరోజు పర్యటనలో ఆయన బెంగళూర్‌ వెళ్లి కర్ణాటక సీఎం బీఎస్‌ యెడియూరప్పను కలవనున్నారు. 2004 నుంచి భారత్‌-యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo