మంగళవారం 19 జనవరి 2021
National - Jan 09, 2021 , 00:18:14

ఫిబ్ర‌వ‌రి 25న నీర‌వ్ మోదీ అప్ప‌గింత‌పై తీర్పు

ఫిబ్ర‌వ‌రి 25న నీర‌వ్ మోదీ అప్ప‌గింత‌పై తీర్పు

లండ‌న్‌: ప‌ంజాబ్ నేస‌న‌ల్ బ్యాంకు (పీఎన్పీ) ఫ్రాడ్ కేసులో ప్ర‌ధాన నిందితుడు నీర‌వ్ మోదీని భార‌త్‌కు అప్ప‌గించే విష‌య‌మై దాఖ‌లైన పిటిష‌న్‌పై వ‌చ్చేనెల 25వ తేదీన తీర్పు చెబుతామ‌ని లండ‌న్‌లోని వెస్ట్ మినిస్ట‌ర్ కోర్టు జ‌డ్జి శామ్యూల్ గూజీ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. బ్రిట‌న్‌-భార‌త్ అప్ప‌గింత ఒప్పందం ప్ర‌కారం బ్రిట‌న్ కోర్టుల్లో సంబంధిత వ్య‌క్తి నేరాల‌ను భార‌త్ రుజువు చేయాల్సి ఉంటుంది.

అయితే, నీర‌వ్ మోదీ త‌ర‌ఫు న్యాయ‌వాది క్లైరీ మోంటోమెరీ వాదిస్తూ.. త‌న క్ల‌యింట్‌కు వ్య‌తిరేకంగా స‌రైన ఆధారాల్లేవ‌ని అన్నారు. భార‌త‌దేశంలో త‌మ క్ల‌యింట్‌కు స్వేచ్ఛాపూరిత విచార‌ణ ల‌భించ‌ద‌ని వాదించారు.

భార‌త్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూష‌న్ స‌ర్వీస్ హెలెన్ మాల్కం మాట్లాడుతూ భార‌త్‌లో మాదిరి బ్రిట‌న్‌లో గ‌ల చ‌ట్టాల ప్ర‌కారం నీర‌వ్ మోదీకి వ్య‌తిరేకంగా ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పారు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో రుణాలు తీసుకుని ఫ్రాడ్ చేసిన‌ట్లు బ‌హుళ ఆధారాలు ల‌భించాయ‌ని వాదించారు. 

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.