గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 14:46:25

నీర‌వ్ మోదీకి బెయిల్ తిర‌స్క‌ర‌ణ‌

నీర‌వ్ మోదీకి బెయిల్ తిర‌స్క‌ర‌ణ‌

హైద‌రాబాద్‌: పీఎన్‌బీ కుంభ‌కోణం కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీకి బ్రిట‌న్ కోర్టు బెయిల్ తిర‌స్క‌రించింది. కోర్టు ఆయ‌న‌కు బెయిల్‌ను తిర‌స్క‌రించ‌డం ఇది అయిదోసారి. ఈ ఏడాది 24వ తేదీ వ‌ర‌కు అత‌న్ని క‌స్ట‌డీలో ఉంచ‌నున్నారు. లండ‌న్‌లోని వాండ్స్‌వ‌ర్త్ జైలులో అత‌ను శిక్ష‌ను అనుభ‌విస్తున్నాడు.  వీడియో లింక్ ద్వారా అత‌ను కోర్టుకు బెయిల్ పిటిష‌న్ స‌మ‌ర్పించుకున్నాడు.  వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ..  పీఎన్‌బీ బ్యాంకులో వంద‌ల కోట్ల స్కామ్‌కు పాల్ప‌డ్డారు. స్కాట్‌ల్యాండ్ యార్డ్‌లో గ‌త ఏడాది అత‌న్ని అరెస్టు చేశారు. మార్చి 11వ తేదీ నుంచి అప్ప‌గింత ప్ర‌క్రియ‌పై కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది.  


logo