శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 23, 2020 , 14:22:12

ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న యూనివ‌ర్సిటీలు: యూజీసీ

ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న యూనివ‌ర్సిటీలు: యూజీసీ

న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 818 యూనివ‌ర్సిటీల్లో 603 యూనివ‌ర్సిటీలు ఇప్ప‌టికే ప‌రీక్ష నిర్వ‌హించాయ‌ని లేదా ప‌రీక్షల‌ నిర్వ‌హ‌ణ‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయ‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ప్ర‌క‌టించింది. 603 యూనివ‌ర్సిటీల్లో 209 వ‌ర్సిటీలు ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాయ‌ని, 394 వ‌ర్సిటీలు ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో చివ‌రి ఏడాది లేదా చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని వెల్ల‌డించింది. 

ఫైన‌లియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల్సిందేన‌ని యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌చేయ‌డంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈరోజు విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల‌కు సంబంధించి యూనివ‌ర్సిటీల జాబితాను విడుద‌ల చేసింది. 209 యూనివ‌ర్సిటీలు ఇప్ప‌టికే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాయ‌ని, మ‌రో 394 విశ్వ‌విద్యాల‌యాలు ఏర్పాట్లు చేస్తున్నాయ‌ని తెలిపింది. 


logo