బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 16:34:41

నవం­బర్‌ ఒకటి నుంచి డిగ్రీ, పీజీ క్లాస్‌లు

నవం­బర్‌ ఒకటి నుంచి డిగ్రీ, పీజీ క్లాస్‌లు

న్యూఢిల్లీ : దేశ­వ్యా­ప్తంగా డిగ్రీ, పీజీ తర­గ­తులు నవం­బర్‌ నుంచి ప్రారం­భం­కా­ను­న్నాయి. ఈ మేరకు యూరి­వ­ర్శిటీ గ్రాంట్స్‌ కమి­షన్‌ (యూజీసీ) మంగళ­వారం మార్గ­ద­ర్శ­కాలు విడు­దల చేసింది. ఈ మేరకు ఈ ఏడాది నవం­బర్ 1 నుంచి దేశ­వ్యా­ప్తంగా ఉన్న విశ్వ­వి­ద్యా­ల­యాలు కొత్త అకా­డ­మిక్ సెషన్ కోసం తర­గ­తు­లను ప్రారం­భిం­చాలి. 30 నవం­బర్ 2020 నాటికి అడ్మి­షన్ ప్రక్రియ పూర్తి చేయా­లని కూడా కమి­షన్ యూని­వ­ర్సి­టీ­లను ఆదేశిం­చింది. నవంబర్‌ 30 తర్వాత ప్రవేశాలను అనుమతించరు.

యూజీసీ మొదట ఉన్నత విద్యా­సం­స్థల కోసం ప్రత్నా­మ్నాయ అకా­డ­మిక్‌ క్యాలెండ­ర్‌ను ఏప్రిల్‌ 29న విడు­దల చేసింది. దీంట్లో విశ్వ విద్యాలయాలు తమ చివరి సంవ­త్సరం లేదా, టెర్మి­నల్ సెమి­స్టర్‌ పరీ­క్షను జూలై 1 నుంచి జూలై 15 వరకు నిర్వ­హిం­చా­లని, ఫలి­తా­లను నెలాఖరులో ప్రక­టిం­చా­లని సూచిం­చింది. కరోనా మహ­మ్మారి నేప­థ్యంలో మళ్లీ క్యాలెండర్‌ను సంవరిం­చింది.

2020-21 విద్యా సంవ­త్స­రా­నికి సంబం­ధించి మొదటి ఏడాది అండర్‌ గ్రాడ్యు­యేట్‌, పోస్ట్‌ గ్రాడ్యు­యేట్‌ విద్యా­ర్థుల సౌలభ్యం కోసం ఈ అకాడ­మిక్‌ క్యాలెం­డ­ర్‌కు సంబం­ధిం­చిన యూజీసీ మార్గ­ద­ర్శ­కాల మేరకు కమిటీ సమ­ర్పిం­చిన నివే­ది­కను ఆమోదించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది. ఈ ఏడాది విద్యా సంవ­త్స­రా­నికి సంబం­ధించి నవం­బర్‌ 30 వరకు యూని­వ­ర్సి­టీల్లో అండర్ గ్రాడ్యు­యేట్‌, పోస్ట్‌ గ్యాడ్యు­యేట్‌ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మి­షన్లు రద్దు చేసు­కున్న, వలస వెళ్లిన విద్యా­ర్థు­లకు ఫీజులు తిరిగి చెల్లి­స్తా­రని కేంద్ర విద్యా­శాఖ మంత్రి రమేష్ పోఖ్రి­యాల్ నిశాంక్ తెలి­పారు.

కరోనా నేప­థ్యంలో విద్యా­ర్థుల తల్లి­దం­డ్రు­లపై మరింత భారం పడ­కూ­డ­దన్న ఉద్దే­శంతో ఈ ఒక్క­సా­రికి ప్రత్యే­కంగా ఈ మేరకు అవ­కాశం కల్పించినట్లు చెప్పారు. దీంతో అండర్ గ్రాడ్యు­యేట్‌, పోస్ట్‌ గ్యాడ్యు­యేట్‌ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మి­షన్లు నవం­బర్‌ 30 వరకు రద్దు చేసుకునే విద్యా­ర్థులు, వల­స­ వె­ళ్లిన విద్యా­ర్థులు వారు చెల్లిం­చిన ఫీజులు తిరిగి పొందు­తా­రని పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo