బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 12:33:36

హిందూ ధర్మప్రచార ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

హిందూ ధర్మప్రచార ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

తిరుపతి : టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి-25 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీన ఉగాది అదేవిధంగా ఏప్రిల్‌ 2వ తేదీన శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో గల రామాలయాల్లో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించడంతో పాటు ఉగాది పచ్చడి పంపిణీ చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో ఏడు రోజు రోజుల పాటు ప్రముఖ పండితులు శ్రీరామనవమి విశిష్టత, శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సీతా చరిత్ర, సేవాధర్మం, రామాయణం, ఇంటింటి కథ, శ్రీరామరాజ్యం, రామాయణం జాతికి సందేశం అనే అంశాలపై ధార్మికోపన్యాసాలు జరగనున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్‌ ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.


logo