మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 13:50:55

సీఎం విజయన్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేత రమేశ్

సీఎం విజయన్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేత రమేశ్

తిరువనంతపురం: బంగారం స్మగ్లింగ్ కేసుకు బాధ్యత వహించి సీఎం పినరాయి విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని కేరళలోని ప్రతిపక్ష యూడీఎఫ్ డిమాండ్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉన్నత హోదాలో ఉన్న స్వప్న సురేశ్, యూఏఈ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకురావడం వెనుక సీఎంవో కార్యాలయం ప్రమేయం ఉన్నదని ఆయన ఆరోపించారు. ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ అనేది స్వప్న సురేష్‌ను ఐటీ విభాగంలో నియమించిన ప్లేస్‌మెంట్ ఏజెన్సీ అని రమేశ్ తెలిపారు. క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న ఆమెను నిఘా వ్యవస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉంచిందని చెప్పారు. 

ఆ మహిళకు సీఎం విజయన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే నిందను ఆ ప్లేస్‌మెంట్ ఏజెన్సీపైకి నెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని రమేశ్ విమర్శించారు. సీఎం ప్రధాన కార్యదర్శికి కూడా ఆమెతో సంబంధాలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయనను ఆ పదవి నుంచి తప్పించారన్నారు. ఉన్నత హోదాలో జరిగిన బంగారం స్మగ్లింగ్ వ్యహారానికి బాధ్యత వహించి సీఎం విజయన్ రాజీనామా చేయాలని రమేశ్ డిమాండ్ చేశారు.


logo