ఆదివారం 31 మే 2020
National - May 10, 2020 , 20:23:28

కాంగ్రెస్‌ తప్పుకొంటేనే థాక్రే నిలబడుతాడు

కాంగ్రెస్‌ తప్పుకొంటేనే థాక్రే నిలబడుతాడు

ముంబై: శాసనమండలికి జరుగునున్న ఎన్నికల్లో తమ పార్టీ అధినేత ఉద్దవ్‌ థాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, అలా కుదరనిపక్షంలో ఎన్నికల బరి నుంచి ఉద్దవ్‌ తప్పుకొంటారని శివనసేన సీనయర్‌ నేత సంజయ్‌ రౌత్‌ స్పష్టంచేశారు. ఆదివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం పంచుకొంటున్న కాంగ్రెస్‌ తమతో రాజకీయాలు చేయడం ఏమాత్రం బాగోలేదన్నారు. ఉద్దవ్‌ థాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకొని శాసనమండలికి పంపుదామని ఆయన సూచించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ నేతలకు స్పష్టంచేస్తున్నానన్నారు. ఉద్దవ్‌ థ్రాక్కే ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడరు, కానీ ప్రస్తుత పరిస్థితి రాజకీయ యుద్ధాలకు దారితీయొద్దని తాము భావిస్తున్నట్లు సంజయ్‌ రౌత్‌ చెప్పారు.

శివసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఉద్దవ్‌ థాక్రే.. ఎన్సీపీ, కాంగ్రెస్‌ సభ్యుల మద్దతుతో మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, అసెంబ్లీలోగానీ, మండలిలోగానీ ఆయనకు సభ్యత్వం లేకపోవడంతో ఆర్నెళ్లలోపు ఏదేని ఒక సభ సభ్యుడిగా ఎన్నికైతేనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. ఈ నెల 28లోపు ఆయన ఏదేని సభకు ఎన్నికకావాల్సి ఉంటుంది. మొత్తం 9 శాసనమండలి స్థానాలకు ఈ నెల 21 న ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. తమకున్న బలం మేరకు బీజేపీ నలుగుర్ని బరిలో నిలిపింది. ఎన్సీపీ, శివసేనలు చెరో ఇద్దరు అభ్యర్థుల చొప్పున నిలుపుతున్నారు. అయితే, కాంగ్రెస్‌ ఒకర్ని నిలుపాల్సి ఉండగా.. ఇద్దరు  అభ్యర్థులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. 


logo