గురువారం 28 జనవరి 2021
National - Oct 08, 2020 , 18:02:33

బీహార్ ఎన్నిక‌‌ల్లో ఉద్ద‌వ్ థాక‌రే ప్ర‌చారం!

బీహార్ ఎన్నిక‌‌ల్లో ఉద్ద‌వ్ థాక‌రే ప్ర‌చారం!

ముంబై: మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, శివ‌సేన పార్టీ అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ థాక‌రే బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌నున్నారు. ఉద్ధ‌వ్ థాక‌రేతోపాటు ఆయ‌న త‌న‌యుడు ఆదిత్య థాక‌రే సైతం బీహార్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. గ‌త ఏడాది మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో బీజేపీతో విడిపోయిన శివ‌సేన ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 50 స్థానాల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌, ఎన్నిక‌ల ప్రచారం త‌దిత‌ర అంశాల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది. 

యాభై స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాల‌ని భావిస్తున్న శివ‌సేన ఇప్ప‌టికే 22 మంది అభ్య‌ర్థుల పేర్ల‌తో తొలి జాబితా విడుద‌ల చేసింది. మిగ‌తా 28 స్థానాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో ఉద్ధ‌వ్ థాక‌రే, ఆదిత్య థాక‌రేతోపాటు శివ‌సేన పార్టీకి చెందిన ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు సుభాష్ దేశాయ్‌, సంజ‌య్ రౌత్‌, అనిల్ దేశాయ్‌, వినాయ‌క్ రౌత్, అర‌వింద్ సావంత్‌, ప్రియాంక చ‌తుర్వేది, రాహుల్ షెవాలే, కృపాల్ తుమానే కూడా పాల్గొన‌నున్నారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo