గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 16:26:58

విద్యా సంస్థ‌ల్లో ముస్లింల‌కు 5 శాతం రిజర్వేష‌న్‌

విద్యా సంస్థ‌ల్లో ముస్లింల‌కు 5 శాతం రిజర్వేష‌న్‌

హైద‌రాబాద్‌:  మ‌హారాష్ట్ర‌లో విద్యా సీజ‌న్ ప్రారంభంకానున్న‌ది.  ఈ నేప‌థ్యంలో ఉద్ద‌వ్‌ ఠాక్రే ప్ర‌భుత్వం .. ముస్లింల‌కు ఓ శుభ‌వార్త చెప్పింది.  విద్యా సంస్థ‌ల్లో ముస్లింల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి న‌వాబ్ మాలిక్ తెలిపారు.  దీనికి సంబంధించిన చ‌ట్టాన్ని కూడా తయారు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ఇవాళ శాస‌న‌మండ‌లిలో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  స్కూళ్ల అడ్మిష‌న్ల స‌మ‌యంలో ఈ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తిస్తుంద‌న్నారు.  ఒక‌వేళ నియ‌మాన్ని ఉల్లంఘిస్తే, వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. 


logo
>>>>>>