సోమవారం 13 జూలై 2020
National - May 01, 2020 , 09:09:10

స‌మీపిస్తున్న డెడ్‌లైన్‌.. టెన్ష‌న్‌లో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే

స‌మీపిస్తున్న డెడ్‌లైన్‌.. టెన్ష‌న్‌లో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే

హైద‌రాబాద్: మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ప‌రిస్థితి విచిత్రంగా ఉన్న‌ది.  సీఎం ప‌ద‌విలో కొన‌సాగాలంటే ఆయ‌నకు మే 28వ తేదీ వ‌ర‌కు డెడ్‌లైన్ ఉన్న‌ది.  ఈ లోపే ఉద్ద‌వ్‌.. క‌నీసం శాస‌న మండ‌లి నుంచి అయినా ఎన్నిక కావాలి.  గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉద్ధ‌వ్ ఠాక్రే పోటీ చేయలేదు. కానీ మ‌హారాష్ట్రలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల వ‌ల్ల‌.. శివ‌సేన అధినేత సీఎం బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  అయితే ఆరు నెల‌ల‌ల్లోగా ఉద్ద‌వ్‌.. అసెంబ్లీకి ఎన్నిక అయితేనే సీఎం ప‌ద‌విలో కొన‌సాగే వీలు ఉంటుంది.  క‌నీసం మండ‌లి నుంచి అయినా ఆయ‌న ఎన్నిక కావాల్సిన ప‌రిస్థితి ఎదురైంది.  దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో సీఎం ఉద్ద‌వ్‌.. ఈ విష‌య‌మై ప్ర‌ధాని మోదీకి ఫోన్ చేసిన‌ట్లు తెలిసింది.  లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం అసాధ్య‌మే. ఇక మండ‌లి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి వ‌చ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది.  మోదీతో ఫోన్‌లో మాట్లాడిన త‌ర్వాత‌.. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎన్నిక‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్లు సంకేతాలు అందుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ కూడా స్వాగ‌తించారు.  అయితే ఎన్నిక‌ల సంఘం ఈ అంశంపై ఇవాళ ఓ నిర్ణ‌యం తీసుకునే వీలున్న‌ది. 


logo