శుక్రవారం 05 జూన్ 2020
National - May 18, 2020 , 15:07:38

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌ థాక్రే

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌ థాక్రే

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం మహారాష్ట్ర శాసనమండలి సెంట్రల్‌హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మండలి ఛైర్మన్‌ ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉద్ధవ్‌ థాక్రే సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్య థాక్రే కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయడంతో థాక్రే కుటుంబం నుంచి శాసనమండలిలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా, చట్టసభల్లో అడుగు పెట్టిన రెండో వ్యక్తిగా ఉద్ధవ్‌ థాక్రే నిలిచారు. ఇప్పటికే ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 


logo