గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 12:58:35

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఉద్ధ‌వ్ నామినేష‌న్‌

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఉద్ధ‌వ్ నామినేష‌న్‌

ముంబై: మ‌హారాష్ట్ర శాస‌న మండ‌లి అభ్య‌ర్థిగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే నామినేష‌న్ దాఖ‌లు చేశారు. సోమ‌వారం ఉద‌యం త‌న భార్య‌, కుమారుడితో క‌లిసి వెళ్లి రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో క‌లిసి గ‌త ఏడాది న‌వంబ‌ర్ 29న ఉద్ధ‌వ్ థాక్రే మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయ‌నకు ఏ చ‌ట్ట‌స‌భ‌లోనూ స‌భ్య‌త్వం లేనందున మే 29 లోపు ఏదో ఒక స‌భ‌కు ఎన్నిక కాక‌పోతే ప‌దవి నుంచి దిగిపోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 24న మ‌హారాష్ట్ర శాస‌న‌మండ‌లిలో 9 స్థానాలు ఖాళీ అయ్యాయి. 

ఎమ్మెల్యే కోటాలో ఎన్నికునే ఈ తొమ్మి‌ది స్థానాల్లో ఒక స్థానం కోసం ఉద్ద‌వ్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మే 21న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. మ‌హారాష్ట్ర శాస‌న‌స‌భ‌లో బీజేపీకి 105 మంది స‌భ్యుల బ‌లం ఉన్న‌ది. శివ‌సేన‌కు 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే ఒక్కో అభ్య‌ర్థికి 29 తొలి ప్రాధాన్య ఓట్లు కావాలి. ఈ లెక్క ప్ర‌కారం బీజేపీ మూడు స్థానాలను, అధికార కూట‌మి 5 స్థానాల‌ను స్వ‌త‌హాగా గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ది. మ‌రో స్థానానికి పోటీ ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో కూట‌మి త‌ర‌ఫున ఐదుగురు అభ్య‌ర్థుల‌నే నిల‌బెట్టినందున ఉద్ద‌వ్ గెలుపు దాదాపు ఖాయ‌మైంది.      

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo