శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 09:01:06

కొడుకు చనిపోయాడనుకున్నారు... లాక్‌డౌన్‌తో తిరిగొచ్చాడు..

కొడుకు చనిపోయాడనుకున్నారు... లాక్‌డౌన్‌తో తిరిగొచ్చాడు..


మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలోని ఛతర్‌పూర్‌ జిల్లా దిల్వారీ గ్రామానికి చెందిన ఉదయ్‌ మూడు సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా వారు ఒక శవాన్ని చూపించారు. దుస్తువులు అలాగే ఉండటంతో, వయస్సు అదే కావడంతో తన కొడుకు చనిపోయాడని పోలీసులు ఇచ్చిన శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉదయ్‌ ఈ రోజు ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. దీనిపై బీజవర్‌ పోలీస్‌స్టేషన్‌ అధికారి సీతారం మాట్లాడుతూ... 2017లో ఉదయ్‌ తప్పిపోయాడని అతడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. అతడి వయస్సు ఉన్న శవం ఒకటి దొరకడంతో వారి తల్లిదండ్రులను పిలిచి గుర్తించమని అడిగాం. 

బట్టలు, వయస్సు ఒకే రీతిలో ఉండటంతో తల్లిదండ్రులు తమ కొడుకు చనిపోయాడని పొరబడి శవాన్ని తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయ్‌ ఇంటికి తిరగి రావడంతో, అప్పుడు అంత్యక్రియలు నిర్వహించిన శవం గురించిన దర్యాప్తును మళ్లీ మొదలు పెట్టామని పేర్కొన్నారు. దీనిపై ఉదయ్‌ మాట్లాడుతూ... దొంగతనం చేశావని కొందరు నాపై ఆరోపించి కేసు పెడతామని భయపెట్టారు. దీంతో నేను గ్రామం వదిలి ఢిల్లీ పారిపోయాను. లాక్‌డౌన్‌ కారణంగా తప్పని సరి గ్రామానికి రావాల్సి వచ్చింది. నేను చనిపోయానని బాధపడుతున్న తల్లిదండ్రులకు నా రాకతో ఎంతో సంతోషం కలిగించింది. గ్రామానికి చేరుకున్న వెంటనే అందరూ నన్ను గుర్తుపట్టారని తెలిపాడు. 


logo