8వేల టన్నుల మార్కును అధిగమించిన ఉడాన్

ఢిల్లీ :భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ)ఈ–కామర్స్ వేదిక ఉడాన్ ఎఫ్ఎంసీజీ, ముఖ్యమైన వస్తువులు ,తాజా ఉత్పత్తులతో కూడిన ఆహార వ్యాపారపు లావాదేవీలు ప్రతి రోజూ 8వేల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించాయని వెల్లడించింది. ఆహార విభాగంలో ఈ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహిస్తున్న లావాదేవీల విలువ ఇప్పుడు ఉడాన్‌ను దేశంలో అతిపెద్ద గ్రోసరీ ప్లాట్‌ఫామ్‌గా నిలిపింది. ప్రతిరోజూ సింగపూర్,డెన్మార్క్,ఫిన్లాండ్,నార్వే లాంటి దేశాలు ప్రతి రోజూ వినియోగిస్తున్న ఆహార పరిమాణం కన్నాఇది ఎక్కువ.
ఉడాన్ ఫ్లాట్‌పామ్‌పై ఆహార వ్యాపారం పరంగా గత రెండేండ్లలో అత్యధికంగా 500శాతం వృద్ధి నమోదుచేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై గత ఆరు నెలల్లో ఒక్క ఆహార వ్యాపారంలోనే 50శాతానికి పైగా కొనుగోలుదారులు పెరిగారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై పునరావృత కొనుగోళ్లు కొనుగోలుదారుల నుంచి జరుగుతుండటమనేది ఈ వేదికపై వారి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నది. సరాసరిన ఈ ప్లాట్‌ఫామ్ ప్రతినెలా మూడు మిలియన్ ఆర్డర్లను ఫుడ్ విభాగంలో 50 నగరాల వ్యాప్తంగా అందుకుంటుంది. మొత్తంమ్మీద, ప్రతి రోజూ 1.5 లక్షల ఆర్డర్లు ను ఉడాన్ దేశవ్యాప్తంగా 900కు పైగా నగరాలలో అన్నివ్యాపార విభాగాల వ్యాప్తంగా డెలివరీ చేస్తున్నది.
ఈ ప్లాట్‌ఫామ్‌పై 1.5 మిలియన్ కిరాణా షాపులు, హోరెకా, రైతులు ఉన్నారు. వీరు ఆర్డర్లను అందించడంతో పాటుగా ఆహార ఉత్పత్తుల సరఫరా సైతం చేయడం ద్వారా ఫుడ్ ఈ–కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా నిలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ 20వేలకు పైగా ఉత్పత్తులను కిరాణా, పానీయాలు, తృతధాన్య్యాలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, వంటనూనెలు, గృహ , వ్యక్తిగత సంరక్షణ విభాగాలు, చేప, పాల ఉత్పత్తులు నుంచి విస్తృతశ్రేణి గృహోపకరణాల బేవరేజస్, సెరల్స్ వరకూ అందిస్తుంది. ఉడాన్ ఫుడ్ బిజినెస్ హెడ్ వివేక్ గుప్తా మాట్లాడుతూ ‘‘ ఉడాన్ బలీయమైన సరఫరా చైన్ నెట్వర్క్ 900కు పైగా నగరాలలో ఉండటంతో పాటు12,000కు పైగా పిన్‌కోడ్స్‌ను కవర్ చేస్తుంది.
ఇది సమయానికి తగిన డెలివరీ అందించగలదన్న భరోసా అందించడంతో పాటుగా కొనుగోలుదారులకు నాణ్యమైన ,తాజా ఉత్పత్తులను సైతం అత్యుత్తమ ధరలో అందిస్తుంది. మా భాగస్వామ్య ఎఫ్ఎంసీజీ కంపెనీలు నేరుగా మూడు మిలియన్ల కిరాణా షాపులను , వాణిజ్య వేత్తలను నేరుగా దేశవ్యాప్తంగా మా ప్లాట్‌ఫామ్ ద్వారా కలుసుకోగలరు. తద్వారా వారు తమ లక్ష్యత మార్కెట్లను చేరుకోవడమూ సాధ్యమవుతుంది. ఉడాన్‌పై వృద్ధి చెందిన ఫుడ్ వాల్యూమ్స్, భాగస్వామ్య ఎఫ్ఎంసీజీ కంపెనీలు, కొనుగోలుదారులు, విక్రేతల విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. దేశంలోని వాణిజ్య పర్యావరణ వ్యవస్ధను సాంకేతిక శక్తిపై ఆధారపడిమార్చాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుంది’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
కాలితో మీసం మెలేస్తున్న శృతిహాసన్
హాట్ లుక్ లో అలరిస్తున్న 'రెడ్' భామలు
రామ్ చేతిలో ఏం పట్టుకెళ్తున్నాడో చూడండి..వీడియో
ఆదివాసీలతో ‘వకీల్‌సాబ్’..వీడియో వైరల్
నాగచైతన్య భీష్మాసనం ఎలా వేశాడో చూడండి
కామెడీ క్లబ్ నుంచి బయటికొస్తున్న సునీల్..!
జగపతిబాబు చిత్రానికి సరికొత్త టైటిల్
2020లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు వీళ్ళే..!
తాజావార్తలు
- అవును.. ఆ గబ్బిలాలు మమ్మల్ని కుట్టాయి.. వాటి వల్లే కరోనా!
- మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు..!
- త్రిపుర కాంగ్రెస్ చీఫ్‌పై బీజేపీ మద్దతుదారుల దాడి ?
- బెంగళూరు వదులుకునే ఆటగాళ్లు వీరే..!
- రైతుల ట్రాక్టర్ ర్యాలీపై రేపు సుప్రీంకోర్టు విచారణ
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు