మంగళవారం 31 మార్చి 2020
National - Mar 04, 2020 , 01:50:26

సీఏఏపై సుప్రీంకోర్టులో ఐరాస పిటిషన్‌

సీఏఏపై సుప్రీంకోర్టులో ఐరాస పిటిషన్‌
  • ముస్లింలను మినహాయించడంపై అభ్యంతరం
  • జోక్యం కూడదన్న భారత్‌

న్యూఢిల్లీ, మార్చి 3: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంపై భారత్‌ బాధ్యతల నేపథ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం సీఏఏను పరిశీలించేందుకు కోర్టుకు సహకరిస్తామని పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో మతపర వివక్షను ఎదుర్కొంటున్న హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించాలన్న సీఏఏ ఉద్దేశాన్ని స్వాగతించింది. అయితే ఇస్లాం మతానికి చెందిన వారిని మినహాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 12 పేజీల పిటిషన్‌ను తమ కార్యాలయం దాఖలు చేసినట్లు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ మిచెల్‌ బాచెలెట్‌ జెనీవాలోని భారత శాశ్వత మిషన్‌కు సోమవారం తెలియజేశారు. 

సీఏఏ భారత సార్వభౌమ అంశం: రవీశ్‌కుమార్‌

సీఏఏపై ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ జోక్యంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. సీఏఏ భారత సార్వభౌమ అంశమనిస్పష్టం చేసింది.


logo
>>>>>>