శనివారం 04 జూలై 2020
National - Jun 18, 2020 , 18:27:48

ముంబైలో కుప్పకూలిన ఇల్లు.. ఇద్దరికి తీవ్రగాయాలు

ముంబైలో కుప్పకూలిన ఇల్లు.. ఇద్దరికి తీవ్రగాయాలు

ముంబై : తూర్పు ముంబైలోని మేఘవాడి ప్రాంతంలో ఓ భవనం పోర్షన్‌ ఒక్కసారిగా కుప్పకూలి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడినట్లు బ్రిహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. గురువారం  మధ్యాహ్నం ఒంటిగంట ౩౦నిమిషాల ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని ఓ పోర్షన్‌ కుప్పకూలడంతో శిథిలాల కింద ఇద్దరు మహిళలు చిక్కుకుపోయి గాయపడ్డారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. భవనం కూలడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. logo