మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 15:11:43

వరదలో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనదారుడు.. వీడియో

వరదలో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనదారుడు.. వీడియో

ధూలే : మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా జనం బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జీలు, కల్వర్టుల మీదుగా వరద ప్రవహిస్తున్నది. రోడ్ల మీదకు సైతం వరద వచ్చి ఇండ్లలోకి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధూలే జిల్లాలో కల్వర్టు మీదుగా వరద వేగంగా ప్రవహిస్తుండగా ఓ ద్విచక్రవాహనదారుడు దాటించే ప్రయత్నం చేశాడు. నీటి వేగానికి బైక్‌ అదుపు తప్పడంతో వాహనంతో సహా వరదలో కొట్టుకుపోయాడు. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని కాపాడారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo