శనివారం 04 జూలై 2020
National - Jun 30, 2020 , 08:28:09

క‌శ్మీర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

క‌శ్మీర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల ఏరివేత కొన‌సాగుతున్న‌ది. ఈ రోజు ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మ‌రో ఇద్ద‌రు గుర్తుతెలియ‌ని ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తాబ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. అనంత‌నాగ్ జిల్లా వాఘామా ఏరియాలో ఈ తెల్ల‌వారుజామున ఎన్‌కౌంట‌ర్ ప్రారంభ‌మైంది. జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు, భ‌ధ్ర‌తాబ‌ల‌గాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నాయి. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టినా మ‌రికొంద‌రు ఉగ్ర‌వాదులు అదే ప్రాంతంలో దాగి ఉన్నార‌న్న స‌మాచారం మేర‌కు సెర్చింగ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ద‌ని ఆర్మీ అధికారులు తెలిపారు.   

కాగా, గ‌త ఏడాది కాలంలో జ‌మ్ముక‌శ్మీర్‌లో వెయ్యి మందికిపైగా ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందించే క్ర‌మంలో ప‌లువురు జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు, సైనికులు కూడా వీర మ‌ర‌ణం పొందార‌ని తెలిపింది. అయితే, భార‌త సేన‌లు ఎంత‌మంది ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందించినా పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల నుంచి కొత్త‌గా ఉగ్ర‌వాదుల చొర‌బాట్లు కొన‌సాగుతూనే ఉన్నాయి.   ‌


logo