మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 08:14:50

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా ప్రాంతంలోని సాంబూరాలో ఉగ్రవాదులు ఉన్నారని అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టాయి. భద్రతాబలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఓ పోలీస్‌ అధికారి చెప్పారు. భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని, వారు ఏ గ్రూప్‌కు చెందిన వారన్న సంగతి ఇంకా తెలియరాలేదన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo