సోమవారం 06 జూలై 2020
National - Jun 25, 2020 , 09:14:53

జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని  సోపేరీ సమీపంలో ఉన్న హార్డ్‌శివా గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో ఆర్మీకి చెందిన 22వ రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గాలింపు చేపట్టారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు గురువారం తెల్లవారుజామున కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతున్నది.  

జూన్‌ 23న పుల్వామాలోని బండ్‌ జూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు, ఓ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మరణించారు. గత 20 రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 108 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. జమ్ముకశ్మీర్‌లో మరో వంద మందివరకు ఉగ్రవాదులు క్రియాశీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అందులో ఎక్కువగావిదేశీయులే ఉన్నారని అధికారులు తెలిపారు.


logo