సోమవారం 25 జనవరి 2021
National - Sep 04, 2020 , 14:35:51

బారాముల్లాలో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

బారాముల్లాలో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని బారాముల్లాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుపెట్టాయి. బారాముల్లా జిల్లా పాఠాన్‌లోని యెదిపొరా ప్రాంతంలో ఉగ్ర‌వాదులున్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారంతో భ‌ద్ర‌తా బ‌ల‌‌‌గాలు శుక్ర‌వారం తెల్ల‌వారుజామున నాకాబందీ నిర్వ‌హించాయి.  

ఈ సంద‌ర్భంగా గాలింపు బృందంపై ఉగ్ర‌వాదులు కాల్పులు ప్రారంభించారు. ప్ర‌తిగా భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌వ్వ‌గా, ఇద్ద‌రు భ‌ద్ర‌త సిబ్బంది గాయ‌ప‌డ్డారు. ఇందులో ఒక ఆర్మీ అధికారి ఉండ‌గా, మ‌రొక‌రు స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ (ఎస్ఓజీ) స‌భ్యుడు ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. వెంట‌నే వారిని ఆర్మీ ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌ని, ప్ర‌స్తుతం వారు బాగానే ఉన్నార‌‌ని చెప్పారు. మృతిచెందిన‌ ఉగ్రవాదులు ఏగ్రూప్‌నకు చెందిన‌వార‌నే విష‌యాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. 

ఇదే ప్రాంతంలో నిన్న ముగ్గురు ఉగ్ర‌వాద సానుభూతిప‌రుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు అరెస్టుచేశాయి. 


logo